జాన్వీ కైవసం చేసుకున్న అవార్డ్స్..
15 October 2023
2018లో ధడక్ సినిమాలో కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్.
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ దేవర చిత్రంలో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కానుంది ఈ ముద్దుగుమ్మ.
ఇప్పటివరకు వచ్చిన ఈమె సినిమాలు ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయినా.. ఈ బ్యూటీ నటనకుగాను కొన్ని అవార్డులు కైవసం చేసుకుంది.
2018లో లోక్‌మత్ స్టైలిష్ అవార్డ్స్ వారిచే స్టైలిష్ డెబ్యూట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుపొందింది ఈ వయ్యారి.
2019లో జీ సినీ అవార్డ్స్ ద్వారా ధడక్ చిత్రానికి బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డు అందుకుంది అందాల తార జాన్వీ.
2022లో పింక్‌విల్లా స్టైల్ ఐకాన్స్ అవార్డ్స్ వారి సూపర్ స్టైలిష్ యూత్ ఐడల్ – ఫిమేల్ అవార్డు ఈమెను సత్కరించారు.
2023లో బాలీవుడ్ హంగామా స్టైల్ ఐకాన్స్ వేడుకలో స్టైలిష్ యూత్ ఐకాన్ - ఫిమేల్ అవార్డును సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
2023లో పింక్‌విల్లా స్టైల్ ఐకాన్స్ అవార్డ్స్ వారిచే స్టైల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ – రీడర్స్ ఛాయిస్ అవార్డు పొందింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి