మహానటిలో నటనకి కీర్తి కొల్లగొట్టిన అవార్డులు..
TV9 Telugu
05 June 2024
నేను శైలజ చిత్రంతో రామ్ పోతినేనికి జోడిగా టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసింది వయ్యారి భామ కీర్తి సురేష్.
తెలుగులో తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ వయ్యారి. దీనికి అత్యంత ప్రజాదరణ పొందిన నటిగా అవార్డు గెలిచింది.
తర్వాత నటించిన నేను లోకల్ కూడా బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత చేసిన అజ్ఞాతవాసి చిత్రం డిజాస్టర్ గా నిలిచింది.
దీని తర్వాత ప్రధాన పాత్రలో వచ్చిన మహానటి కీర్తికి కెరీర్ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఈ సినిమాకు నాలుగు అవార్డులు అందుకుంది.
2019లో మహానటి సినిమాకి జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఉత్తమ నటిగా అవార్డును కైవసం చేసింది కీర్తి సురేష్.
అదే ఏడాది జరిగిన ప్రముఖ జీ సినీ అవార్డ్స్ తెలుగు వేడుకలో ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకుంది ఈ వయ్యారి భామ.
2019లో జరిగిన 8వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ లో మహానటికి ఉత్తమ నటి - తెలుగు అవార్డు గెలుచుకుంది.
మహానటి సినిమాకి 66వ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ అవార్డ్స్ వేడుకలో ఉత్తమ నటి – తెలుగు అవార్డు అందుకుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి