అనికా కైవసం చేసుకున్న అవార్డులు ఇవే..

TV9 Telugu

15 April 2024

నవంబర్ 27, 2004న ప్రకృతి అందాలకు పుట్టినిళ్లు కేరళ రాష్ట్రంలోని మంజేరి జన్మించింది క్యూటీ అనికా సురేంద్రన్.

2010లో కధ తుదారున్ను అనే మలయాళీ ఫ్యామిలీ డ్రామా సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చలనచిత్ర అరంగేట్రం చేసింది.

2011లో ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్‌లో మలయాళ చిత్రం కదా తుదారున్ను చిత్రానికి ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు కైవసం చేసుకుంది.

2013లో కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్‌లో మలయాళ చిత్రం 5 సుందరికల్ లో ఆమె నటనకి ఉత్తమ బాలనటి అవార్డు అందుకుంది.

2018లో ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్‌ వేడుకలో మలయాళ చిత్రం ది గ్రేట్ ఫాదర్‌కు ఉత్తమ బాలనటి అవార్డు పొందింది.

2020లో JFW మూవీ అవార్డ్స్‌ పురస్కారంలో తమిళ చిత్రం విశ్వాసంలో ఈ క్యూటీ నటనకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు వరించింది.

2020లో బ్లాక్ షీప్ డిజిటల్ అవార్డ్స్‌ వేడుకలో తమిళ చిత్రం విశ్వాసంకి ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు అందుకుంది.

2023లో కప్పెల రీమేక్ గా వచ్చిన తెలుగు సినిమా బుట్టా బొమ్మ చిత్రంతో తొలిసారి కథానాయకిగా నటించింది ఈ బ్యూటీ.