రాశిని వరించిన అవార్డులు ఇవే..
TV9 Telugu
19 August 2024
30 నవంబర్ 1990న భారతదేశ రాజధాని జన్మించింది రాశి ఖన్నా. ఊహలు గుసలాడే చిత్రంతో తొలిసారి తెలుగులో నటించింది.
తెలుగులో దాదాపు అందరూ స్టార్ హీరోలతో జతలకట్టింది. ఈ ముద్దుగుమ్మా అందుకున్న అవార్డ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
2015లో 4వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వారిచే ఊహలు గుసగుసలాడే చిత్రానికి బెస్ట్ ఫిమేల్ డెబ్యూ తెలుగు అవార్డు అందుకుంది.
అదే ఏడాది సినీమా అవార్డులు ద్వారా ఊహలు గుసగుసలాడే సినిమాలో ఈమె నటనకి ఉత్తమ పరిచయ నటి అవార్డు వరించింది.
2016లో జీ తెలుగు అప్సర అవార్డులు వేడుకల్లో మోస్ట్ గ్లామరస్ దివా ఆఫ్ ది ఇయర్ అవార్డు కైవసం చేసుకుంది ఈ బ్యూటీ.
2017లో TSR TV9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ద్వారా జై లవ కుశ చిత్రానికిగాను ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది.
2019లో తొలి ప్రేమ చిత్రానికి జీ సినీ అవార్డ్స్ తెలుగు వేడుకల్లో ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకుంది.
2021లో సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ వేడుకలో ప్రతి రోజు పండగే & వెంకీ మామ చిత్రాలకు మోస్ట్ పాపులర్ యాక్ట్రెస్ అఫ్ ది ఇయర్ అవార్డు కైవసం చేసుకుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి