కిల్లింగ్ లుక్స్ తో కవ్విస్తున్న చిన్నారి పెళ్లికూతురు
TV9 Telugu
06 June 2024
అవికా గోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. .‘చిన్నారి పెళ్లికూతురు’ ఆనందిగా బాగా ఫేమస్..
ఈ ముద్దుగుమ్మ ముంబైలో పుట్టి పెరిగింది.. పదేళ్ల వయసులోనే నటనా రంగంలోకి అడుగుపెట్టింది. స్కూల్‌లో కంటే షూటింగ్ సెట్స్‌లోనే ఎక్కువ సమయం గడిపింది.
కానీ ‘బాలికా వధు’ సీరియల్ అవికా జీవితాన్నే మార్చేసింది. ఈ సీరియల్‌తో దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు, అవార్డులు అందుకుంది.
ఇదే తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురి’గా ప్రసారమైంది. ‘రాజ్‌కుమార్ ఆర్యన్’, ‘ససురాల్ సిమర్ కా’ అనే సీరియల్స్‌లోనూ నటించింది.
ఈ సీరియల్స్ తర్వాత సినీ అవకాశాలు రావడంతో పూర్తిగా వెండితెర మీదే దృష్టి పెట్టింది.హిందీలో వరుసగా ‘తేజ్’, ‘పాఠ్‌శాలా’ సినిమాల్లో నటించింది.
మొట్టమొదట ‘ఉయ్యాల జంపాల’ అనే తెలుగు చిత్రంతో ఘన విజయం సాధించింది. దీంతో తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి.
లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావా’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాల్లో నటించింది. కానీ, తర్వాత చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
తాజాగా ముద్దుగుమ్మ అవికా గోర్ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట షేర్ చేయగా క్రేజీ కామెంట్స్ తో వైరల్ గా మారాయి.