శ్రీలీలని ఆ స్టార్ హీరోయిన్ తో కంపేర్ చేస్తున్న ప్రేక్షకులు..
14 November 2023
ఆల్రెడీ టాప్ ప్లేస్‌లో ఉన్న అందాల భామలతో పోటికి పడుతున్నారు శ్రీలీల. ముఖ్యంగా డ్యాన్స్ విషయంలో శ్రీలీలను ఓ టాప్ బ్యూటీతో కంపార్ చేస్తున్నారు ఆడియన్స్.
పెళ్లి సందడి సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన క్యూట్ బ్యూటీ శ్రీలీల. రాఘవేంద్రుడి మార్క్‌తో వెండితెర అరంగేట్రం చేసిన ఈ భామ.
తొలి సినిమాతో మంచి నటి అనిపించుకోవటమే కాదు సూపర్బ్ డ్యాన్సర్ అన్న ట్యాగ్ కూడా సొంతం చేసుకున్నారు.
ఆ తరువాత చేసిన సినిమాల్లోనూ శ్రీలీల డ్యాన్స్ మూవ్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. తన డ్యాన్స్ తో ఆకట్టుకుంది.
రవితేజ, రామ్ లాంటి టాప్ డ్యాన్సర్స్‌తో స్టెప్స్ వేసిన శ్రీలీల... ఆడియన్స్ అటెన్షన్‌ను గ్రాబ్ చేయటంలో సక్సెస్ అయ్యారు.
దీంతో ఈ బ్యూటీని సాయి పల్లవితో కంపార్ చేస్తున్నారు ఆడియన్స్. సౌత్ స్క్రీన్ మీద రీసెంట్ టైమ్స్‌లో టాప్ డ్యాన్సర్ అన్న ట్యాగ్ ఒక్క సాయి పల్లవికి మాత్రమే సొంతం.
ఈ బ్యూటీ నటిగా ఎన్ని మార్కులు సాధించారో డ్యాన్సర్‌గా అంతకు మించే పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ ప్లేస్‌కే శ్రీలీల ఎర్త్ పెడుతున్నారట.
సాయి పల్లవి సెలక్టివ్‌గా సినిమాలు చేస్తుండటంతో ఆ గ్యాప్‌ను పర్ఫెక్ట్‌గా క్యాష్ చేసుకుంటున్నారు శ్రీలీల.