ఈమె అందానికి ఆ చంద్రుడైనా సిగ్గుతో తలదించుకొంటాడేమో..

21 December 2023

TV9 Telugu

21 డిసెంబర్ 1994న తమిళనాడులో కోయంబత్తూరులో జన్మించింది ముద్దుగుమ్మ అతుల్య రవి. ఈమెకు దివ్య అని మరో పేరు కూడా ఉంది.

తమిళనాడులోని కోయంబత్తూరులో వివేకం మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో పాఠశాల విద్యను అభ్యసించింది.

తమిళనాడులోని కోయంబత్తూరులో కర్పగం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పట్టా పొందింది ఈ బ్యూటీ.

తర్వాత తమిళనాడులోని చెన్నైలో SRM ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (SRMIST)లో చదువుకుంది ఈ భామ.

దీని తర్వాత కోయంబత్తూరులో శ్రీ కృష్ణ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో చదువుకుంది ఈ ముద్దుగుమ్మ.

'పల్వాది కాదల్' అనే యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ ద్వారా తన యాక్టింగ్ కెరీర్ ని మొదలుపెట్టింది ఈ వయ్యారి భామ.

2017లో కాదల్ కన్ కట్టుదే అనే తమిళ చిత్రంతో కథానాయకిగా సినీ రంగ ప్రవేశం చేసింది. తరువాత మరికొన్ని తమిళ చిత్రాల్లో కనిపించింది.

2023లో యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకి జోడిగా మీటర్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయింది ఈ వయ్యారి.