అందం అనే పేరు ఈమెను చూసే పెట్టారేమో అనేలా అతుల్య..

11 November 2023

21 డిసెంబర్ 1994న తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించింది అందాల తార అతుల్య రవి. ఆమెకు మరో పేరు దివ్య.

తమిళనాడులోని కోయంబత్తూరులోని వివేకం మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో పాఠశాల విద్యను అభ్యసించింది.

తరువాత తమిళనాడులోని కోయంబత్తూరులోని కర్పగం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చదువుకుంది ఈ భామ.

తమిళనాడు రాజధాని చెన్నైలోని SRM ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంది ఈ ముద్దుగుమ్మ.

తమిళనాడులోని కోయంబత్తూరులోని శ్రీ కృష్ణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది.

2017లో కాదల్ కన్ కట్టుదే అనే ఓ తమిళ్ చిత్రంతో సినీ అరంగేట్రం చేసింది ఈ వయ్యారి భామ. శివరాజ్ ఈ చిత్ర దర్శకుడు.

2018లో యెమాలి, 2019లో నాడోడిగల్ 2 వంటి ఎన్నో తమిళ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో కథానాయకిగా కనిపించింది ఈ వయ్యారి.

2023లో యంగ్ హీరోగా కిరణ్ సబ్బవరంకి జోడిగా మీటర్ అనే చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయింది ఈ బ్యూటీ.