వర్జినిటీ కోల్పోవడానికి అదే సరైన ఏజ్: అతుల్య

15 September 2023

తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. పలు సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది హీరోయిన్ అతుల్య రవి.

2017లో 'కాదల్‌కన్ కట్టుడే' అనే చిత్రంతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అతుల్య. ఆ తర్వాత వరుసపెట్టి సినిమాలు చేస్తూ.. మంచి ఫేం సంపాదించింది.

ఇక తెలుగులోకి కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన 'మీటర్' అనే సినిమాతో పరిచయమైంది అతుల్య రవి. ఈ సినిమాలో తన నటనకు, అందానికి మంచి మార్కులు కొట్టేసింది.

సినిమాల్లోకి రాకముందు పలు షార్ట్ ఫిల్మ్‌స్‌లో నటించి.. మెప్పించింది అతుల్య రవి. ఆ తర్వాత వరుసగా తమిళ చిత్రాల్లో నటించింది.

ఏడాదికి నాలుగైదు సినిమాలు నటించే అతుల్య రవి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. అవి కాస్తా వైరల్ అవుతున్నాయి.

కన్యత్వంపై అతుల్య రవిని ఓ ప్రశ్న అడగ్గా.. 'వర్జినిటీ కోల్పోవడానికి 21 నుంచి 25 ఏళ్లు వయస్సు కరెక్ట్ అని సూటిగా సమాధానం ఇచ్చింది.

మరి పెళ్లికి ముందు లైంగిక చర్యలో పాల్గొనడం సరైనదా.? అని ప్రశ్న అడగ్గా.. పెళ్లి తర్వాతే లైంగికపరమైన రిలేషన్ కరెక్ట్ అని చెప్పుకొచ్చింది అతుల్య రవి.

ఈ మధ్యకాలంలో రిలేషన్స్ కొత్త పుంతలు తొక్కాయని చెప్పిన అతుల్య.. ఒకరితో రిలేషన్‌లో ఉండటం అనేది వారి వ్యక్తిగత నిర్ణయం అని.. కానీ వివాహం అన్నింటి కంటే ఉత్తమమైన రిలేషన్ అని చెప్పుకొచ్చింది.