కేపీ చౌదరి డ్రగ్స్‌ కేసు విషయంపై స్పందించిన అషు..

తెలుగులో అషు రెడ్డి అంటే తెలియని వారుండరు.

డబ్స్ మాష్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో ప్రేక్షకులకు దగ్గరైంది.

తెలుగు బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ గా ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే డ్రగ్స్‌ కేసులో అరెస్టైన సినీ నిర్మాత కేపీ చౌదరి కాల్‌ లిస్ట్‌లో ఆమె పేరు ఉన్న సంగతి తెలిసిందే.

తాజా ఈ విషయంపై స్పందించిన అషురెడ్డి.

నాకున్న పరిచయాలను తప్పుబడుతూ కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఆమె ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలిపారు.

నేను వాటిని తీవ్రంగా ఖండిస్తున్నానని, నా మొబైల్‌ నంబర్‌ను అందరికీ తెలిసేలా ప్రచురించడాన్ని ఏమాత్రం అంగీకరించనని తెలిపింది.

‘‘కొన్ని సందర్భాల్లో అవసరమైనప్పుడు తప్పకుండా స్పందించి తీరాలి’’ అంటూ మరో పోస్ట్‌ చేసింది ఆమె.

ప్రస్తుతం ఏ మాస్టర్ పీస్ అనే చిత్రంలో నటిస్తుంది అషురెడ్డి.