అందానికి మేకప్ వేస్తే ఈమెలానే ఉంటుందేమో..

17 November 2023

15 సెప్టెంబర్ 2000న ఆంధ్రప్రదేశ్ లో ప్రకృతి అందాలకు పుట్టినిల్లు విశాఖపట్నంలో జన్మించింది అందాల తార అషు రెడ్డి.

యూఎస్ లోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ లో డల్లాస్ బాప్టిస్ట్ యూనివర్సిటీలో ఎంబిఏ పూర్తిచేసింది ఈ వయ్యారి.

మణికట్టుపై హార్ట్ సింబల్, ముంజేయిపై 'ఈట్ స్లీప్ రావే రిపీట్' అని, పవన్ కళ్యాణ్ పేరు, చేతిపై డాడీ అనే 4 ట్యాటూలు ఈ బ్యూటీ శరీరంపై ఉన్నాయి.

చాలామందికి తెలియని విషయం ఏంటంటే మెర్స్డ్స్ బెంజ్ యంగ్, స్కోడా సూపర్బ్, ముస్తాంగ్, BMW కార్లు ఈ అందాల భామ దగ్గర ఉన్నాయి.

డబ్స్‌మాష్, జోష్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో లిప్-సింక్ వీడియోల ద్వారా ఫేమస్ అయింది.

2018లో నితిన్, మేఘ ఆకాష్ జంటగా నటించిన ఛల్ మోహన్ రంగ అనే తెలుగు సినిమాతో తెరంగేట్రం చేసింది ఈ బ్యూటీ.

2019లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో కంటెస్టెంట్ గా ప్రేక్షకులకు చేరువైన ఈ బ్యూటీ ఐదవ వారంలో ఎలిమినట్ అయింది.

ప్రస్తుతం ' ఎ మాస్టర్ పీస్: రైజ్ ఆఫ్ సూపర్ హీరో ' అనే ఓ తెలుగు సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.