శుభవార్త చెప్పనున్న 'బేబీ' హీరోయిన్.. ఏంటో తెలుసా?

TV9 Telugu

02 June 2024

షార్ట్ ఫిల్మ్స్‌తో యూట్యూబర్ గా  కెరీర్ మొదలుపెట్టింది తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. అదే సమయంలో పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది.

అయితే 'బేబి' సినిమాతో వైష్ణవి చైతన్య దశ పూర్తిగా తిరిగిపోయింది. ఇందులో ఆమె నటనకు పలువురి ప్రశంసలు సైతం వచ్చాయి

ఇక  ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్  కావడం వల్ల వైష్ణవికి హీరోయిన్‌గా టాలీవుడ్‌లో మంచి ఛాన్సులు, ఆఫర్లు వరిస్తున్నాయి. 

ఇటీవలే ఆశిష్ రెడ్డి సరసన వైష్ణవి నటించిన లవ్ మీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది.

తాజాగా తన మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రముఖ టీవీ రియాలిటీ షోకు హాజరైంది వైష్ణవి. హీరో ఆశిష్ రెడ్డి కూడా ఈ షోలో పాల్గొన్నాడు.

తాజాగా రిలీజైన ఈ ప్రోమోలో ఓ చోట హీరో అశిష్.. వైష్ణవి చైతన్య త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతుందని చెప్పాడు.

దీంతో వెంటనే యాంకర్ సుమ.. 'రీసెంట్‪‌గా పెళ్లి జరిగింది నీకు, చెబితే నువ్వు చెప్పాలి' అని ఆశిష్ రెడ్డిపై సెటైర్ వేసింది.

మరి వైష్ణవి చైతన్య నుంచి గుడ్ న్యూస్ అంటే పెళ్లి ఏమైనా చేసుకోబోతుందా అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.