వైష్ణవి చైతన్య, ఆశిష్ లవ్ మీ రిలీజ్ డేట్ వచ్చేసింది..
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్, బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న సినిమా లవ్ మీ. ఈ మూవీకి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రాన్ని శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న రిలీజ్ చేయాల్సి ఉంది.
కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా వాయిదా పడుతుందని వార్తలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించింది మూవీ టీం.
ఈ సినిమాను మే 25న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ తో అంచనాలు పెరిగాయి.
దెయ్యాన్ని ప్రేమించడం కోసం హీరో దెయ్యాన్ని వెతుకుంటూ వెళ్లడం అందర్నీ ఆకట్టుకుంటుంది. దాంతో ఈ సినిమాపై అంచనాలతోపాటు క్యూరియాసిటి పెరిగింది.
ఇక ఈ మూవీ నుంచి విడుదలైన రావాలి రా అంటూ దెయ్యాలు పాడే సాంగ్ సినీ ప్రియులను ఎక్కువగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది.
అంతేకాకుండా రొమాంటిక్ హార్రర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ గ్రహీత సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే.
రౌడీ బాయ్స్ సినిమాతో హీరోగా పరిచయమైన ఆశిష్ ఫస్ట్ మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇక బేబీ సినిమాతో హీరోయిన్గా అందరి దృష్టిని ఆకర్షించింది వైష్ణవి.