03 June 2025

ఆ స్టార్ హీరోకు జోడిగా ఆషికా.. ఇకనైనా కలిసొస్తుందా.. ?

Rajitha Chanti

Pic credit - Instagram

కన్నడలో మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది హీరోయిన్ ఆషికా రంగనాథ్. ఆతర్వాత వరుస సినిమాలతో స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. 

ఆ తర్వాత అమిగోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఈ మూవీ ప్లాప్ కావడంతో అంతగా గుర్తింపు రాలేదు.

కానీ కొన్ని రోజులు సైలెంట్ అయిన ఆషికా.. నాగార్జున సరసన నా సామిరంగ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అయినా ఈ బ్యూటీకి ఛాన్స్ రాలేదు. 

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, త్రిష నటిస్తోన్న విశ్వంభర చిత్రంలో ఈ బ్యూటీ నటిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఈ అమ్మడు మరో ఆఫర్ అందుకుందట. 

మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు మాస్ జాతర చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడని టాక్. 

ఇందులో రవితేజ సరసన కేతిక శర్మను సెలెక్ట్ చేశారు మేకర్స్. కాగా ఇప్పుడు ఈ సినిమాలో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కూడా సెలక్ట్ చేశారని టాక్. 

అయితే ఈ చిత్రంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ త్వరలోనే ఈ సినిమా గురించి పూర్తి వివరాలను మేకర్స్ అనౌన్స్ చేయనున్నారట. 

ఇక ఈ బ్యూటీకి తెలుగులో అంతగా గుర్తింపు రాలేదు. ఇప్పుడిప్పుడే ఛాన్సులు అందుకుంటున్న ఆషికాకు రవితేజ సినిమా ఏమైనా బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.