చిరంజీవి సినిమాలో ఆషికా రంగనాథ్.. విశ్వంభరలో స్పెషల్ రోల్..
Rajitha Chanti
Pic credit - Instagram
ఇప్పుడిప్పుడే తెలుగు ఇండస్ట్రీలో బిజీ అవుతుంది కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్. సైలెంట్‌గా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
డెవిల్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆషికా.. తొలి చిత్రంతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. కానీ ఈ మూవీ అంతగా మెప్పించలేకపోయింది.
ఆ తర్వాత కొన్నిరోజులు గ్యాప్ తీసుకున్న ఆషికా.. ఈ ఏడాది నా సామిరంగ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో వరలక్ష్మిగా కనిపించింది.
అక్కినేని నాగార్జున సరసన నా సామిరంగ మూవీతో హిట్ అందుకున్న కన్నడ భామ ఆషికా.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో క్రేజీ ఛాన్స్ అందుకుంది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఆషికా పోస్టర్ రిలీజ్ చేశారు.
డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీలో హీరోయిన్ త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ లో జాయిన్ అయ్యింది.
ఇక ఇప్పుడు ఈ మూవీలో హీరోయిన్ ఆషికా కూడా జాయిన్ అయ్యింది. అయితే ఈ కన్నడ హీరోయిన్ ఎలాంటి పాత్రలో కనిపించనుందనేది తెలియాల్సి ఉంది.
కన్నడలో అనేక హిట్ చిత్రాల్లో నటించిన ఆషికా.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటేందుకు రెడీ అయ్యింది. ఇప్పుడే వరుస ఆఫర్స్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.