ఇంతటి అందాన్ని మోస్తున్న ఈ నేలది ఎన్ని జన్మల పుణ్యమో..
TV9 Telugu
10 January 2024
5 ఆగస్టు 1996న కర్ణాటకలోని బెంగుళూరుకి 70 కిలోమీటర్లు దూరంలో ఉన్న తుమకూరులో జన్మించింది ఆషిక రంగనాథ్.
ఈ వయ్యారి తండ్రి పేరు రంగనాథ్, తల్లి పేరు సుధా రంగనాథ్. ఆమె అక్క అనూషా రంగనాథ్ కూడా నటిగా పని చేస్తుంది.
కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరులోన బిషప్ సార్గంత్ స్కూల్‌లో తన పాఠశాల విద్యను పూర్తిచేసింది ఈ ముద్దుగుమ్మ.
తర్వాత జ్యోతి నివాస్ కళాశాలలో ప్రీ-ఇన్ కోసం బెంగళూరుకు వెళ్ళింది ఈ వయ్యారి భామ. అక్కడ కళాశాల విద్య అభ్యసించింది.
క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగుళూరు పోటీ కోసం ఆడిషన్ చేసి మిస్ ఫ్రెష్ ఫేస్ 2014 రన్నరప్‌గా నిలిచింది.
2016లో క్రేజీ బాయ్ అనే కన్నడ రొమాంటిక్ చిత్రంలో కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది. తర్వాత కొన్ని చిత్రాల్లో కనిపించింది.
2023లో కళ్యాణ్ రామ్ సరసన అమిగోస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రానికి ఆశించిన ఫలితం దక్కలేదు.
ఈ వయ్యారి తాజాగా హీరోయిన్ గా నటించిన నా సామి రంగ సంక్రాంతి సందర్భంగా 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి