అందం ఈమె ఇంట్లో బందీగా ఉందేమో.. ఆషిక అందానికి కుర్రాళ్లు ఫిదా...

03 October 2023

కళ్యాణ్ రామ్ కి జోడిగా అమిగోస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్.

సినిమా ఫలితం ఎలా ఉన్నా తన అందంతో ఆకట్టుకుంది. ఈ అందాల తార ఈ చిత్రానికి ముందు కన్నడ, తమిళ చిత్రాల్లో నటించింది.

2016 క్రేజీ బాయ్ అనే ఓ కన్నడ చిత్రంతో సినీ అరంగేట్రం చేసింది ఆషిక. ఈ చిత్రంలో దిలీప్ ప్రకాష్ హీరోగా కనిపించారు.

తర్వాత కన్నడ స్టార్ యాక్టర్ శివరాజ్ కుమార్, ప్రణీత జోడిగా నటించిన మాస్ లీడర్ చిత్రంలో ఓ కీలక పాత్రలో ఆకట్టుకుంది.

కన్నడ మొగులు నాగే అనే చిత్రంలో లీడ్ రోల్ లో కనిపించి మెప్పించింది ఈ అందాల తార. ఈ చిత్రంలో నటనతో ఆకట్టుకుంది.

తర్వాత రాజు కన్నడ మీడియం, రాంబో 2తో పాటు ఎన్నో కన్నడ చిత్రాల్లో నటించి స్టార్ డమ్ తెచ్చుకుంది ఆషిక.

కిచ్చ సుదీప్ కోటిగొబ్బ 3, పునీత్ రాజ్‌కుమార్ జేమ్స్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ.

తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది ఈ బ్యూటీ. ఈ ఫోటోలకు కుర్రాళ్లు తెగ లైక్స్ కొడుతున్నారు.