అషికా అందాల వడ్డింపు..

15 September 2023

అషికా రంగనాద్.. ఈ కన్నడ బ్యూటీ తెలుగులో చేసింది ఒక్క సినిమానే.. కానీ తన అందాలతో ఫ్యాన్స్‌ను కట్టిపడేసింది.

ఈ శాండిల్‌వుడ్ మిల్కీ బ్యూటీ.. కన్నడంలో 10కి పైగా చిత్రాల్లో నటించింది. పలు సూపర్ హిట్స్‌ను కూడా తన ఖాతాలో వేసుకుంది.

'రాంబో 2', 'తాయిగే తక్క మగ', 'మదగజ', 'అవతార పురుష', 'గరుడ', 'రైమో' లాంటి సినిమాలు అషికా రంగానాద్ కెరీర్‌లో చెప్పుకోదగిన సినిమాలు.

వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్న అషికా రంగనాద్.. ఫిట్‌నెస్ విషయంలోనూ క్రమశిక్షణ పాటిస్తుంది. క్రమం తప్పకుండా జిమ్‌లో వర్క్‌ఔట్స్ చేస్తూ.. చెమటోడుస్తుంది.

కన్నడ సినిమాలతో బిజీగా ఉన్న అషికా రంగనాద్‌కు తెలుగులోని పలు అవకాశాలు వస్తున్నాయి. కళ్యాణ్ రామ్ 'అమిగోస్' చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన అషికా.. ప్రస్తుతం నాగార్జున సినిమాలో నటిస్తుందని టాక్.

అషికా రంగనాద్.. సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను పలకరిస్తుంది.

తాజాగా అషికా రంగనాద్ షేర్ చేసిన కొన్ని ఫోటోలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ లైకుల మోత మోగిస్తున్నారు.

కాగా, అషికా రంగనాద్ 2016లో 'క్రేజీ బాయ్' చిత్రంతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కన్నడంలో 'O2', 'గతవైభవ' చిత్రాల్లో నటిస్తోంది ఈ భామ.