అందమైన ఈ అమ్మడిని చూస్తే ఆ సూర్యుడు కూడా చల్లబడతాడేమో..

17 December 2023

5 ఆగస్టు 1996న కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు అనే ఊరిలో జన్మించింది 27 ఏళ్ల అందాల సుందరి ఆషికా రంగనాథ్.

కర్ణాటకలోని హాసన్ జిల్లాలో రంగనాథ్, సుధా రంగనాథ్ దంపతులకు కన్నడ కుటుంబంలో పుట్టి పెరిగింది ఈ వయ్యారి భామ.

ఈ వయ్యారికి అనూషా రంగనాథ్ ఆమె ఓ అక్క ఉంది. ఆమె కూడా ప్రస్తుతం శాండల్ వుడ్ సినిమాల్లో నటిగా కొనసాగుతుంది.

తుమకూరులోని బిషప్ సార్గెంట్ స్కూల్‌లో చదువుకుంది. జ్యోతి నివాస్ కాలేజీలో ప్రీ-ఇన్ కోసం బెంగళూరుకు వెళ్లింది.

ఆమె క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగుళూరు పోటీ కోసం ఆడిషన్ చేసింది. మిస్ ఫ్రెష్ ఫేస్ 2014 రన్నరప్‌గా నిలిచింది.

చదువుకొనే రోజుల్లో ఫ్రీస్టైల్, బెల్లీ, వెస్ట్రన్‌తో సహా వివిధ నృత్య రూపాల్లో శిక్షణ పొందింది ఈ బ్యూటీ.

2016లో క్రేజీ బాయ్ అనే కన్నడ రొమాంటిక్ చిత్రంతో కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ వయ్యారి భామ.

2023లో అమిగోస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. ప్రస్తుతం తెలుగులో నా సామిరంగా చిత్రంలో హీరోయిన్ గా చేస్తుంది.