ఈమెతో పోటీపడితే ఆ అందం కూడా ఓడిపోతుందేమో..

06 November 2023

5 ఆగస్టు 1996న కర్ణాటకలోని తుమకూరులో జన్మించింది ఆషిక రంగనాథ్. ఆమె తండ్రి రంగనాథ్, తల్లి సుధా రంగనాథ్.

తుమకూరులోని బిషప్ సార్గెంట్ స్కూల్‌లో చదువుకుంది. జ్యోతి నివాస్ కాలేజీలో ప్రీ-ఇన్ కోసం బెంగళూరుకు వెళ్లింది.

క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగుళూరు పోటీ కోసం ఆడిషన్ చేసి మిస్ ఫ్రెష్ ఫేస్ 2014 రన్నరప్‌గా నిలిచింది.

ఫ్రీస్టైల్, బెల్లీ, వెస్ట్రన్‌తో సహా మరికొన్ని రకాల డ్యాన్స్ శిక్షణ తీసుకుంది వయ్యారి భామ ఆషిక రంగనాథ్.

ఫ్రెష్ ఫేస్ బెంగుళూరు పోటీలో ఆమెను చూసిన దర్శకుడు మహేష్ బాబు క్రేజీ బాయ్ మూవీలో హీరోయిన్ గా ఎంపిక చేయడంతో నటనలో ఆషికా ప్రస్థానం ప్రారంభమైంది.

SIIMA ద్వారా ప్రముఖ పాత్రలో ఉత్తమ డెబ్యూ నటి అవార్డుకు ఎంపికైంది. అయితే ఆ అవార్డు ఈ బ్యూటీని వరించలేదు.

తర్వాత కొన్ని కన్నడ, తమిళ్, తెలుగు చిత్రాల్లో కథానాయకిగా నటించి తన అందం, అభినయంతో ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ.

2023లో కళ్యణ్ రామ్ కి జోడిగా అమిగోస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ చిన్నది. ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది.