05 October 2024

క్యాస్టింగ్ కౌచ్ పై బుల్లితెర నటి షాకింగ్ కామెంట్స్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

బుల్లితెర ప్రపంచంలో తనకంటూ ఓ పేరు సంపాదించుకుంది ఆశానేగి. పదేళ్లుగా టీవీ ఇండస్ట్రీలో రాణిస్తూ గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ

తన కెరీర్ తొలినాళ్లల్లో ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని తాజాగా బయటపెట్టింది. ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఆశా. 

అప్పట్లో కో ఆర్టినేటర్స్ ఉండేవాళ్లని.. ఏదైనా అవకాశాలు ఉన్నాయంటే వాళ్లే చెప్పేవాళ్లని.. అలా ఓ వ్యక్తి తనకు పరిచయమయ్యడని తెలిపింది.

తనతో మీటింగ్ కూడా అయ్యిందని.. అప్పుడు తనకు కేవలం ఇరవై ఏళ్లని.. టెలివిజన్ ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుందో తెలియదని చెప్పింది.

ఇండస్ట్రీలో కొన్నింటికి ఓకే చెప్పాల్సి ఉంటుందని.. అప్పుడే నీకు ఎదుగుదల ఉంటుందని పెద్ద స్టార్స్ కూడా ఈ పద్దతిలోనే పాపులర్ అయ్యారని..

అతడు అనేక విధాలుగా చెప్పాడు. అప్పుడే అతడి ఉద్దేశం ఏంటో అర్థమైందని తెలిపింది. తను చెప్పినట్లు చేస్తేనే భవిష్యత్తు ఉంటుందని చెప్పాడట

అలాంటి కెరీర్ తనకు వద్దనుకున్నానని.. తనకు ఏమాత్రం ఆసక్తి లేదని అతడి ముఖం మీదే చెప్పేశానని ఆ విషయం తన స్నేహితులతో చెప్పిందట.

ఇలాంటివి ఇండస్ట్రీలో సర్వసాధారణం అని చాలా సింపుల్ గా చెప్పేశాడని తెలిపింది. పవిత్ర రిష్తా సీరియల్లో పూర్వీ దేశ్ ముఖ్ గా నటించింది ఆశా.