టైగర్ 3 రిజల్ట్ టైగర్ వర్సెస్‌ పఠాన్ పై ప్రభావం పడనుందా..

03 December 2023

ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్ మీద ఎన్నో మూవీ యూనివర్స్‌లు సందడి చేస్తున్నా, సూపర్‌ స్ట్రాంగ్‌గా కనిపిస్తున్న యూనివర్స్‌ మాత్రం వైఆర్ఎఫ్‌ స్పై యూనివర్స్ ఒక్కటే.

అందుకే ఆ సీరిస్‌లో అప్‌ కమింగ్ సినిమాల మీద ఆడియన్స్‌లో ఫోకస్‌ గట్టిగా కనిపిస్తోంది. అయితే ఈ యూనివర్స్‌ నుంచి రాబోయే ఓ భారీ చిత్రం ఇప్పుడు డైలామాలో పడిందట.

పఠాన్ రిలీజ్‌కు ముందే ఆల్రెడీ రిలీజ్ అయిన ఎక్తా టైగర్‌, టైగర్ జిందాహై, వార్‌ సినిమాలను ఒకే యూనివర్స్‌కు కిందకు తీసుకువస్తూ స్పై యూనివర్స్‌ను ఎనౌన్స్ చేసింది వైఆర్ఎఫ్‌.

షారుఖ్ పఠాన్‌, సల్మాన్ టైగర్‌ 3 సినిమాలు కూడా ఆ యూనివర్స్‌లో భాగంగానే రిలీజ్‌ అయినా సంగతి తెలిసిందే.

రీసెంట్‌ రిలీజ్ టైగర్‌ 3 తరువాత వార్‌ 2, టైగర్ వర్సెస్‌ పఠాన్ లాంటి భారీ యాక్షన్‌ మూవీస్‌ను ఎనౌన్స్‌ చేసింది వైఆర్ఎఫ్‌.

కానీ టైగర్ 3 రిలీజ్‌ తరువాత సీన్ మారిపోయింది. ఆ సినిమాకు అనుకున్న రేంజ్‌లో రెస్పాన్స్‌ రాకపోవటంతో టైగర్ వర్సెస్‌ పఠాన్‌ విషయంలో రీ థింక్ చేస్తోంది యూనిట్.

అన్ని ఓకే అనుకున్న తరువాతే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యింది యాష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ.

దీంతో 2024లోనే సెట్స్ మీదకు వెళుతుందనుకున్న ఈ మెగా మల్టీస్టారర్‌ మరో  ఏడాది పాటు ఆలస్యం కానుందన్న టాక్ వినిపిస్తోంది.