మరో ప్రయోగానికి రెడీ అవుతున్న అరవింద్‌ స్వామి..

28 October 2023

80స్‌, 90స్‌ సమయంలో అమ్మాయిల కలల రాకుమారుడిగా  పేరు తెచ్చుకున్నారు తమిళ స్టార్ నటుడు అరవింద్ స్వామి.

అప్పట్లో పాన్ ఇండియా ఇమేజ్‌ సాధించిన ఈ ఛార్మింగ్ హీరో సడన్‌గా కొన్ని కారణాల వల్ల వెండితెరకు దూరమయ్యారు.

లాంగ్ గ్యాప్ తరువాత తనీ ఒరువన్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి మరోసారి తన మార్క్ నటన చూపించారు అరవింద్ స్వామి.

తనీ ఒరువన్‌ తెలుగు రీమేక్‌ ధృవతో టాలీవుడ్‌లో కూడా రీ ఎంట్రీ ఇచ్చిన అరవింద్ స్వామి, సెకండ్ ఇన్సింగ్స్‌లోనూ మల్టీ లింగ్యువల్‌ స్టార్‌గా ప్రూవ్ చేసుకున్నారు.

అయితే ప్రజెంట్ సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న ఈ సీనియర్ హీరో, త్వరలో డైరెక్షన్‌ చేసే ప్లాన్‌లో ఉన్నారు.

ఆల్రెడీ కథ సిద్ధం చేసుకున్న అరవింద్ స్వామి లీడ్ క్యారెక్టర్‌కు మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్‌తో చర్చలు జరుపుతున్నారు.

రీసెంట్‌గా మామన్నన్ సినిమాలో నెగెటివ్ రోల్‌తో కోలీవుడ్‌లోనూ స్టార్ ఇమేజ్‌ అందుకున్నారు ఫాహద్‌ ఫాజిల్‌.

అంతా ఓకే అయితే 2024 స్టార్టింగ్‌లోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు అరవింద్ స్వామి. ఈ సినిమాలో తాను కూడా కీ రోల్‌లో నటించనున్నారు.