TV9 Telugu
లావణ్య కాకుండా.. ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం: వరుణ్ తేజ్
13 Febraury 2024
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటేస్ట్ సినిమా 'ఆపరేషన్ వాలెంటైన్'. బాలీవుడ్ బ్యూటీ మానుషి చిల్లర్ ఇందులో హీరోయిన్‌గా నటించింది
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఆపరేషన్ వాలంటైన్ సినిమా మార్చి1న గ్రాండ్ గా రిలీజ్ కానుంది
తాజాగా తన సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ముఖ్యంగా అందాల రాక్షసి లావణ్య త్రిపాఠితో వైవాహిక బంధం గురించి పలు ముచ్చట్లు చెప్పాడు. అలాగే పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు.
ఈ సందర్భంగా 'మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు ?' అని అడగ్గా... 'నా ఫేవరేట్ హీరోయిన్ నే నేను పెళ్లి చేసుకున్నాను' అని చెప్పుకొచ్చాడు వరుణ్.
లావణ్య కాకుండా సాయి పల్లవి అంటే అభిమానమని అన్నారు. వీరిద్దరూ ఫిదాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.
అలాగే మంచి కథ కుదిరితే తానూ, లావణ్య కలిసి త్వరలోనే నటిస్తామంటూ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు వరుణ్ తేజ్.
ఇక తానే లావణ్యకు ఫస్ట్ లవ్ ప్రపోజ్ చేశానంటూ కాలేజీ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు వరుణ్ తేజ్.
ఇక్కడ క్లిక్ చేయండి..