నటుడు పృథ్వీరాజ్‌కు షాక్.. అరెస్టు వారెంట్ జారీ
TV9 Telugu
13 June 2024
సినీ ఇండస్ట్రీలో ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పేరిట మంచి గుర్తింపు తెచ్చుకున్న సినీనటుడు పృథ్వీరాజ్‌కు ఊహించని షాక్.
విజయవాడ పట్టణంలోని స్థానిక ఫ్యామిలీ కోర్టు అతడికి మంగళవారం నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది.
మనోవర్తి చెల్లించాలంటూ నటుడు పృథ్వీరాజ్ భార్య శ్రీలక్ష్మి అతడిపై విజయవాడ ఫ్యామిలీ కోర్టులో కేసు వేసింది.
ఈ కేసు కోసం పృథ్వీరాజ్ కోర్టుకు హాజరుకావడం లేదని విజయవాడ స్థానిక ఫ్యామిలీ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
తాడేపల్లిగూడెంలో జన్మించిన పృధ్వీరాజ్ 1992లో రాజేంద్రప్రసాద్ ఆ ఒక్కటి అడక్కు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసారు.
దాదాపు 100 సినిమాల్లో కనిపించాడు. కృష్ణ వంశీ ఖడ్గంలో "30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ" అనే డైలాగ్‌తో మంచి గుర్తింపు పొందారు.
పృధ్వీ రాజ్ 2018లో YSRCPలో చేరారు, అది అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్‌గా నామినేట్ అయ్యారు.
2024 జనవరి 24న ఆంద్రప్రదేశ్‌లోని మంగళగిరి జనసేన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి