అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య వివాహం..
సౌత్ ఇండస్ట్రీలో హీరోగా, డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ‘అర్జున్ సర్జా’.
తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు.
ఇదిలా ఉంటే ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్ త్వరలో వివాహం చేసుకోనున్నట్లు న్యూస్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.
ఆమె కూడా కథానాయకిగా పలు చిత్రాల్లో నటించింది.
ఆమె తన కో-స్టార్ ఉమాపతి రామయ్యతో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా వీరిద్దరి వివాహం త్వరలో ఘనంగా జరగనుందని సమాచారం.
ప్రముఖ కోలీవుడ్ హాస్య నటుడు, జాతీయ అవార్డ్ గ్రహీత తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్య.
వీరి ప్రేమను అంగీకరించిన ఇరు కుటుంబాలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది.
ఈ విషయంపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి