04 April 2024
ఆస్పత్రిలో చేరిన 'బిగ్ బాస్' అరియానా.. ఏమైందంటే?
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రముఖ తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో అందాల తార అరియానా గ్లోరీ ఒకరు.
బిగ్ బాస్ తర్వాత కొన్ని టీవీషోల్లోనూ సందడి చేసింది అరియానా. అయితే ఈ మధ్యన సోషల్ మీడియాలోనే ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.
పార్టీలు, ఫంక్షన్లు, వెకేషన్స్, టూర్స్ అంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటుంది.
తాజాగా ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ పెట్టింది అరియానా గ్లోరీ. అందులో ఆమె దంత వైద్యుడిని సంప్రదించిన ఫొటోలు ఉన్నాయి.
అరియానా కు పంటి సమస్యలు ఉన్నాయని , అందుకే ఆస్పత్రిలో డెంటిస్ట్ ను కలిసిందని ఈ ఫొటోలు చెప్పకనే చెబుతున్నాయి.
డాక్టర్లు తనకు ఎంతో చక్కగా వివరించారని, ఎంతో చక్కగా ట్రీట్ మెంట్ కూడాటఇచ్చారని ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో రాసుకొచ్చింది అరియానా గ్లోరీ.
అయితే ఆ పంటి సమస్య ఏంటన్నది మాత్రం క్లియర్‌గా చెప్పలేదు అరియానా. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో అరియానా చేసిన ఇంటర్వ్యూ ఆమెకు మరింత పాపులారిటీని తీసుకొచ్చింది.
ఇక్కడ క్లిక్ చేయండి..