ఓటీటీలో వెబ్ సిరీస్ ఎక్కువగా యాక్షన్ చిత్రాలు మాత్రమే ఉంటాయని అనుకుంటారు కానీ కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలు కూడా ఉంటాయి
మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలు ఉన్నా చాలామంది అలాంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ అలాంటి ఒక వెబ్ సిరీస్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
నిజానికి పెళ్లి అయిన వాళ్లు, పెళ్లి కావాల్సిన వాళ్లు తప్పకుండా చూడాల్సిన వెబ్ సిరీస్ అది. ఇది ఏ సర్టిఫికేట్ సిరిసే.. కాస్త బోల్డ్ గా కూడా ఉంటుంది.
ఈ వెబ్ సిరీస్ గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ 2020లో వచ్చింది. దీనిలో నటించిన తిరువీర్ అప్పుడు అంత ఫేమస్ కాకపోవచ్చు.
కానీ మసూద సినిమా వచ్చిన తర్వాత చాలా ఫేమస్ అయ్యాడు. ఈ తిరువీర్ ఆనంద్ పాత్రలో ఈ వెబ్ సిరీస్ లో యాక్టిగ్ ఇరగదీశాడు. ఈ వెబ్ సిరీస్ పేరు సిన్.
ఇది 2020లో ఆహాలో విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు బోల్డ్ కంటెంట్ అంటే ఈ సిరీస్ పేరు వినిపిస్తూనే ఉంటుంది.
అంతేగానీ సిరీస్ మాత్రం తప్పక చూడాల్సిన లిస్ట్ లో ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ లో తిరువీర్ ఒక కన్నింగ్ హస్బెండ్ లా, ఒక ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్న వాడిలా డిఫరెంట్ షేడ్స్ లో మంచిగా యాక్టింగ్ చేశాడు.