12 September 2023

మ్యూజిక్ దేవుడు కాస్తా... డెవిల్ అయ్యాడు.. 

Pic credit - Instagram

ఏఆర్ రెహమాన్.. ఆస్కార్‌ అవార్డ్‌ ముద్దాడిన ట్యాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇండియాలోనే నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్.

ఏఆర్ రెహమాన్.. ఆస్కార్‌ అవార్డ్‌ ముద్దాడిన ట్యాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇండియాలోనే నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్.

మ్యూజిక్ లవర్స్‌నే కాదు.. కామన్ ఆడియెన్స్‌ను కూడా తన మ్యూజిక్‌తో మెస్మరైజ్ చేసే రెహమాన్.. తాజాగా మాత్రం వారి ఏడుపుకు కారణం అయ్యారు.

తనకున్న మ్యూజిక్ గాడ్ అనే ట్యాగ్‌ను.. కమర్షియల్ డెవిల్ గా మారేలా చేసుకున్నారు. 

అసలు విషయం ఏంటంటే! చాలా గ్యాబ్ తర్వాత.. చెన్నైలో ఓ మ్యూజిక్ కన్సర్ట్ ఏర్పాటు చేశారు రెహమాన్.

దీంతో రెహమాన్ అభిమానులందరూ ఈ మ్యూజిక్ షో కోసం పోటీపడ్డారు. ఈవెంట్‌ రోజు షోకు భారీగా తరలివచ్చారు.

అయితే భారీగా తరలివచ్చిన రెహమాన్ అభిమానులను మేనేజ్ చేయలేని షో నిర్వాహకులు చేతులెత్తేశారు. కనిపించకుండా పోయారు.

దీంతో ఈవెంట్ దగ్గర తొక్కిసలాట జరిగింది. పిల్లలు, ఆడాళ్లు తీవ్ర ఇబ్బంది పడ్డారు. 

టికెట్లు ఉన్నా కూడా.. చాలా మంది లోపలికి వెళ్లలేక బయటే ఉన్నారు. దీంతో వీరందరూ రెహమాన్‌ వ్యతిరేకంగా ఆందోళన చేశారు.

రెహమాన్‌ను తిట్టిపోశారు. షో ఏర్పాట్లపై, నిర్వహుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక ఇది తెలిసిన రెహమాన్ సోషల్ మీడియా వేదికగా వారందరికీ క్షమాపణ చెప్పారు. తన వల్ల ఇబ్బంది పడ్డ వారిని కూల్ చేసే ప్రయత్నం చేశారు.