కుర్రకారు గూగుల్ లో ఎక్కువగా వెతుకుంటున్న హీరోయిన్ ఎవరో తెలుసా ??
Phani CH
24 AUG 2024
ఆన్ లైన్ మాధ్యమాల్లో అనేకం విషయాల గురించి సెర్చ్ చేస్తుంటారు.. అయితే ఈ రోజు గూగుల్ లో యూత్ ఎక్కువగా వెతికే హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
అన్వేషి జైన్ గురించి కుర్రకారుకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.. హాట్ ఫోటో షూట్ తో ఫుల్ పాపులర్ అయింది.
ఎప్పటికపుడు సోషల్ మీడియా తన హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేయడం అన్వేషి మార్క్ స్టైల్ అని చెప్పాలి.
తెలుగులో రవితేజ హీరోగా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’లో ఐటెం సాంగ్ తో అందరి మనసులు కొల్లగొట్టింది ఈ బ్యూటీ.
అన్వేషి కేవలం నటి మోడల్ మాత్రమే కాదు.. ఓ మోటివేషనల్ స్పీకర్ కమ్ యూట్యూబర్.. ప్రస్తుతం వెబ్ సిరీస్, సినిమాల్లో సత్తా చూపెడుతోంది.
ఈమె మధ్యప్రదేశ్ లోని ఖజురహోలో జన్మించింది. భోపాల్ లోని రాజీవ్ గాంధీ టెక్నికల్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది.
2018లో ‘గందీ బాత్’ వెబ్ సిరీస్ తో పాపులర్ అయింది. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అయితే ఈ హాట్ బేబిని గూగుల్ లో ఎక్కువ మంది కుర్రాళ్లు సెర్చ్ చేసే బ్యూటీగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.