చీరలో అందానికి ప్రతిబింబంలా రంగమ్మత్త..

TV9 Telugu

25 March 2024

15 మే 1985న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది అందాల తార అనసూయ భరద్వాజ్.

తెలంగాణలోని హైదరాబాద్ నగరంలోని బద్రుకా కాలేజీ నుంచి ఎంబీఏలో డిగ్రీ పట్టా పొందింది వయ్యారి భామ అనసూయ.

చదువు పూర్తైన తర్వాత హైదరాబాద్ లో ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో HR ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసింది ఈ ముద్దుగుమ్మ.

ప్రారంభదశలో వచ్చిన చాలా సినిమా ఆఫర్లను తిరస్కరించిన ఈ వయ్యారి సాక్షి టీవీకి టీవీ యాంకర్‌గా పనిచేసింది.

తర్వాత కొన్ని టెలివిషన్ షోలకు యాంకర్ గా చేసింది. చివరిగా ఈటీవీ జబర్డస్త్ లో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

యాంకర్ గా చేస్తూనే కొన్ని కచిత్రాల్లో నటించింది. రంగస్థలంలో రంగమ్మత్తగా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ బ్యూటీ.

తర్వాత పుష్పలో దాక్షాయణి పాత్రలో మెప్పించింది. ఈ సినిమా తర్వాత వరుస సినిమా ఆఫర్లు క్యూ కట్టడంతో జబర్దస్త్ కు గుడ్ బాయ్ చెప్పింది.

ఇటీవల వచ్చిన రజాకార్ సినిమాలో పోచమ్మగా మెప్పించింది. దీనికి ముందు విమానంలో సుమతి పాత్రలో ఆకట్టుకుంది.