TV9 Telugu
08 January 2024
అనుష్క నెక్ట్స్ మూవీ.. ఆ స్టార్ డైరెక్టర్‌తోనే
గతేడాది హీరో నవీన్ పొలిశెట్టి తో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది అనుష్కా శెట్టి
ఇందులో అనుష్క అందం, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. పలువరి సెలబ్రిటీల నుంచి ప్రశంసలు కూడా వచ్చాయి
అయితే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా రిలీజై నెలలు గడుస్తున్నా నెక్ట్స్ ప్రాజెక్టును అనౌన్స్ చేయలేదు అనుష్క
తాజాగా అనుష్క శెట్టి తర్వాతి సినిమా కూడా లేడీ ఓరియంటెడ్ కథతోనే ఉంటుందని టాలీవుడ్ సర్కిళ్లలో టాక్ నడుస్తోంది
ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్ల మూడి తెరకెక్కిస్తోన్న ఓ వుమెన్ సెంట్రిక్ మూవీ స్వీటీ హీరోయిన్‌గా నటించనుందట
గతంలో క్రిష్ జాగర్ల మూడి తెరకెక్కించిన వేదం సినిమాలో అనుష్క కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే
ఇక్కడ క్లిక్ చేయండి..