27 July 2025

బాబోయ్.. అనుష్క ఆస్తులు ఎన్ని కోట్లు ఉంటాయో తెలుసా.. ? 

Rajitha Chanti

Pic credit - Instagram

సౌత్ ఇండస్ట్రీలో అనుష్క శెట్టికి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. నాగార్జున, ప్రభాస్, రవితేజ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. 

తెలుగులో ప్రభాస్, అనుష్క జోడికి సెపరేట్ ప్యాన్ బేస్ ఉంటుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన బాహుబలి సినిమా భారీ హిట్ అందుకుంది.

ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకున్న అనుష్క.. ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ బ్యూటీ.

ప్రస్తుతం ఘాటీ చిత్రంలో నటిస్తుంది. లేడీ ఓరియెంటెడ్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉంటే.. సినిమాల్లోకి రాకముండు అనుష్క యోగ టీచర్ అన్న సంగతి తెలిసిందే. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.140 కోట్లు. 

నెలకు దాదాపు 1 కోటి వరకు సంపాదిస్తుందట. అలాగే సంవత్సరానికి రూ.12 కోట్లు సంపాదన. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.6 కోట్లు తీసుకుంటుంది. 

బ్రాండ్ ఎండార్స్‏మెంట్స్ నుంచి ఏడాదికి రూ.12 కోట్లు సంపాదిస్తుంది. అలాగే చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల్లో ఈ బ్యూటీకి ఇళ్లు ఉన్నాయి. 

బాహుబలి సినిమా తర్వాత ఇండస్ట్రీలో సైలెంట్ అయిన అనుష్క.. ఇప్పుడిప్పుడే వరుస సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తుంది.