08 November 2025
అనుష్క శెట్టి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా.. ? 44 ఏళ్ల వయసులో..
Rajitha Chanti
Pic credit - Instagram
ఒకప్పుడు తెలుగు సినీరంగంలో చక్రం తిప్పిన హీరోయిన్ అనుష్క శెట్టి. ఇప్పుడు నటనలో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఆడపాదడపా చిత్రాలు చేస్తుంది.
ఇటీవలే ఘాటి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకులేకపోయింది.
సినిమాల్లోకి రాకముందు అనుష్క ఒక స్కూల్లో యోగా టీచర్‌గా పనిచేసింది. ఆ తర్వాత నాగార్జున, పూరి కాంబోలో వచ్చిన సూపర్ సినిమాతో తెరంగేట్రం చేసింది.
ఆ తర్వాత అరుంధతి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆమె.. తెలుగులో స్టార్ హీరోలతో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అంతేకాదు కంటెంట్ నచ్చితే పాత్ర కోసం ఎలాంటి రిస్క్ అయినా చేసేందుకు సిద్ధపడుతుంది. జీరో సైజ్ సినిమా కోసం ఏకంగా పది కేజీల వరకు బరువు పెరిగింది.
బహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న అనుష్క.. ఆ తర్వాత తెలుగులో సినిమాలు తగ్గించి తక్కువగా చేస్తుంది.
అనుష్క ఒక్కో సినిమాకు రూ.6 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. అలాగే నివేదికల ప్రకారం అనుష్క శెట్టి ఆస్తులు రూ.140 కోట్ల వరకు ఉంటుందట.
ఆమె వద్ద BMW, ఆడి వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె వయసు 44 సంవత్సరాలు కాగా.. ఇప్పటికీ ప్రేమ, పెళ్లి మాట ఎత్తకుండా ఒంటరిగా ఉంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్