30 January 2024

స్టార్‌ క్రికెటర్‌తో కలిసి పెళ్లిపీటలెక్కనున్న అనుష్క..

TV9 Telugu

టాలీవుడ్‌ లో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది మంగళూరు బ్యూటీ అనుష్కా శెట్టి

గతేడాది నవీన్‌ పొలిశెట్టితో కలిసి అనుష్క నటించిన మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సూపర్‌ హిట్‌గా నిలిచింది.

సినిమాల సంగతి పక్కన పెడితే ప్రేమ, పెళ్లి విషయాలతో అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తోంది అనుష్క.

గతంలో తనతో పలు సినిమాల్లో జోడీగా నటించిన ప్రభాస్‌తో స్వీటీ పెళ్లి జరుగుతుందని చాలా మంది భావించారు.

అయితే అదేమీ జరగలేదు. ప్రభాస్‌ తనకు మంచి స్నేహితుడని పలు సందర్భాల్లో స్వయంగా చెప్పుకొచ్చింది అనుష్క.

తాజాగా మరోసారి అనుష్కా శెట్టి ప్రేమ, పెళ్లి వార్తలు సోషల్‌ మీడియాలో  గుప్పమంటున్నాయి.  

ఓ స్టార్‌ క్రికెటర్‌తో స్వీటి వివాహం జరగనుందని, ఇరు కుటుంబ సభ్యులు కూడా దీనికి అంగీకరించారని ప్రచారం జరుగుతోంది.

అయితే అనుష్క పెళ్లి వార్తల్లో నిజమెంతుందో అనేది మాత్రం తెలియాల్సి ఉంది.