ఎట్టకేలకు పెళ్లిపీటలెక్కనున్న అనుష్క.. వరుడు ఎవరో తెలుసా?
07 October 2024
Basha Shek
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అనుష్కా శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బాహుబలితో పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిందామె.
అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి తదితర చిత్రాలతో టాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది స్వీటీ.
అయితే సైజ్ జీరో సినిమా అనుష్క పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ ను కూడా మార్చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ చిత్రంలోని పాత్ర కోసం భారీగా బరువు పెంచిన అనుష్క ఆ తరువాత ఆ బరువును తగ్గించుకోవడానికి చాలా కష్ట పడింది.
ఇలాంటి పరిస్థితుల్లో అనుష్క పెళ్లికి సిద్ధం అవుతుందనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి.
దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్తను స్వీటీ పెళ్లి చేసుకోబోతున్నట్లు కుటుంబ సభ్యులు కూడా పెళ్లి పనుల్లో ఉన్నారని ప్రచారం సాగుతోంది.
అయితే ఇంతకు ముందు కూడా అనుష్క పెళ్లిపై పలుమార్లు రూమర్లు వచ్చాయి. కానీ అవేవీ నిజం కాలేదు.
అనుష్క కూడా ఇలాంటి వార్తలను పెద్దగా పట్టించుకోలేదు. మరి తాజా పెళ్లి ప్రచారంలో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.
ఇక్కడ క్లిక్ చేయండి..