మైండ్ బ్లాక్ చేస్తున్న అనుష్క స్టన్నింగ్ లుక్స్ 

TV9 Telugu

13 March 2024

ఒకప్పుడు టాలీవుడ్ అగ్రతారలలో అనుష్క శెట్టి ఒకరు. సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత వరుస హిట్స్ ఖాతాలో వేసుకున్నారు.

ఆ తర్వాత బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ  ప్రాజెక్ట్స్ తర్వాత సినిమాలకు, సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు.

ఈ క్రమంలోనే రీసెంట్గా సెకండ్‌ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మరో హిట్టును తన అకౌంట్‌లో వేసుకున్నారు.

ఇక మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తర్వాత కొన్నాళ్లు సైలెంట్ అయ్యింది జేజమ్మ. ఇన్నాళ్లుగా ఒక్క ప్రాజెక్ట్ కూడా ప్రకటించలేదు.

కానీ ఇప్పుడు తన కొత్త సినిమాను అనౌన్స్ చేసింది. కానీ తెలుగులో కాదు.. మలయాళంలో ఓ సినిమాలో నటిస్తోంది..

రీసెంట్గా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ షూటింగ్ లో జాయిన్ అయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇక అనుష్కను చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇన్నాళ్లుగా బొద్దుగా కనిపించిన అనుష్క.. ఇప్పుడు బరువు తగ్గి స్లిమ్ లుక్ లోకి మారిపోయారు.