06 September 2023

 పెళ్లిపై నమ్మకముంది.. అప్పుడు కచ్చితంగా చేసుకుంటా: అనుష్క

చాలా రోజుల తర్వాత సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించనుంది అందాల తార అనుష్కా శెట్టి

నిశ్శబ్ధం తర్వాత మరే సినిమా చేయలేదు స్వీటీ. చాలా రోజుల పాటు గ్యాప్‌ తీసుకుంది

ఈ గ్యాప్‌ను కవర్‌ చేసేందుకు మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది

నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటిస్తోన్న ఈ మూవీ గురువారం (సెప్టెంబర్‌ 7) న  గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది

ఈ సినిమా ప్రమోషన్లలో తన పర్సనల్‌ లైఫ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది అనుష్క

పెళ్లిపై తనకున్న అభిప్రాయాలను, అలాగే తన మ్యారేజ్‌ గురించి ఒక హింట్‌ ఇచ్చింది

పెళ్లిపై తనకు చాలా నమ్మకముందని, దీనికి నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదంది స్వీటీ

సమయం వస్తే తాను కచ్చితంగా వివాహం చేసుకుంటానని తెలిపింది అనుష్కా శెట్టి