09 November 2025

గ్లామర్ ప్రపంచాన్ని ఏలేసిన హీరోయిన్.. 44 ఏళ్ల వయసులో పెళ్లి రూమర్స్

Rajitha Chanti

Pic credit - Instagram

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో సంచలనం సృష్టించింది. నాగార్జున, వెంకటేశ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో అనేక సినిమాల్లో కనిపించింది.

ప్రస్తుతం ఆమె వయసు 44 సంవత్సరాలు. చాలా కాలంగా ఆమె పెళ్లి గురించి ఫిల్మ్ వర్గాల్లో ఏదోక న్యూస్ వినిపిస్తుంది. ఇప్పుడు మరోసారి ఆమె పెళ్లి వార్త తెరపైకి వచ్చింది.

ఆమె మరెవరో కాదండి హీరోయిన్ అనుష్క శెట్టి. సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై అరుంధతి సినిమాతో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది అనుష్క.

ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. ఒకప్పుడు గ్లామర్ రోల్స్ తో తెలుగు సినిమా ప్రపంచంలో చక్రం తిప్పింది.

తెలుగులో హిట్ కాంబోలో అనుష్క, ప్రభాస్ జంట ఒకటి. వీరిద్దరి జోడికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే వీరి కాంబోలో వచ్చిన మిర్చి, బాహుబలి సూపర్ హిట్ అయ్యాయి.

బాహుబలి తర్వాత అనుష్క సినిమాలు తగ్గించింది. ఎప్పుడో ఒక సినిమాతో అడియన్స్ ముందుకు వస్తుంది. ఇటీవలే ఘాటి సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చింది.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరోసారి అనుష్క పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

ఓ క్రికెటర్ ను ఆమె పెళ్లి చేసుకోబోతుందనే ప్రచారం నెట్టింట జోరుగా సాగుతుంది. అయితే ఈ రూమర్స్ పై ఇప్పటివరకు అనుష్క గానీ, ఆమె టీమ్ గానీ స్పందించలేదు.