ప్రేమలో ఎమోషన్‌ ఉండాలి.! ఒక్క మాటతో మళ్లీ రచ్చకెక్కిన స్వీటీ..

11 September 2023

ఆఫ్టర్స్ 5 ఇయర్స్ గ్యాప్‌..! మిస్‌ షెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో.. మన మందుకు వచ్చిన అనుష్క మరో సారి హిట్టు కొట్టారు.

కాస్త లావయ్యారనే కంప్లైట్‌ను పక్కకు పెడితే.. తన లుక్స్‌తో.. సెటిల్ట్ అండ్ మెచ్యూర్డ్‌ పర్ఫార్మెన్స్‌తో అందర్నీ ఆకట్టుకున్నారు.

మిస్‌ షెట్టి సినిమాతో.. అనుష్క, అటు ఓవర్సీస్‌లోనూ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏకంగా వన్ మిలియన్ కలెక్షన్స్‌ రాబట్టారు.

ఇక మూవీ హిట్ టాక్‌తో పాటే.. తాను ప్రేమ, పెళ్లిపై చేసిన ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌తో.. ప్రభాస్‌తో కలిసి నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈ స్వీటీ. 

ప్రేమ.. పెళ్లిలో.. ఎమోషన్ ఉండాలని.. అదంగా ఆర్గానిక్‌గా జరగాలని.. చెప్పారు అనుష్క.

తాను పెళ్లికి వ్యతిరేకం కాదంటూ.. కానీ దానికి సరైన సమయం రావాలి అంటూ.. కూడా.. చెప్పుకొచ్చారు స్వీటి. 

అయితే స్వీటీ చేసిన ఈ కామెంట్స్‌తో.. ప్రభాస్‌, అనుష్కల ప్రేమ, పెళ్లి మ్యాటర్ మరో సారి తెరమీదికొచ్చింది.

దేనికైనా సరైన టైం రావాలని స్వీటి నోటి నుంచి వచ్చిన మాట.. మళ్లీ ప్రభాస్‌ స్వీటీ రిలేషన్‌షిప్‌  స్టేటస్‌పై కామెంట్స్ వచ్చేలా చేస్తోంది.