పదేళ్లైనా తగ్గని క్రేజ్.. వరుస సినిమాలతో అమ్మాడి జోరు..
Rajitha Chanti
Pic credit - Instagram
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పది సంవత్సరాలు. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో ఫుల్ జోష్ మీద దూసుకుపోతుంది ఈ హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరో మీకు తెలుసా.. ?
ఆ బ్యూటీ మరెవరో కాదండి.. మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ప్రేమమ్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ దశాబ్ద కాలం పూర్తి చేసుకుంది.
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు పూర్తైనప్పటికీ రఈ బ్యూటీ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ వయ్యారి.
ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటికే నాలుగు సినిమాలతో అడియన్స్ ముందుకు వచ్చి సక్సెస్ అయ్యింది అనుపమ.
ఈ బ్యూటీ నటించిన సినిమాలు కమర్షియల్ హిట్స్ కావడంతో ఆమెకు మరిన్ని ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. అలాగే ఇప్పటివరకు ఆమె నటించిన చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.
జానకీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, కిష్కిందాపురి, పదా సినిమాలతో హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు మరో రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉంది.
త్వరలోనే మలయాళంలో ది పెట్ డిటెక్టివ్ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతుంది.ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నటనకు మంచి మార్కులు పడనున్నాయని టాక్.
అలాగే బైసన్ సినిమాలోనూ అనుపమ నటిస్తుంది. తమిళంలో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ నటిస్తోన్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.