లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న అనుపమ

Rajeev 

02 February 2025

Credit: Instagram

మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మల్లో అనుపమ పరమేశ్వరన్ క్రేజే వేరు. తక్కువ సమయంలోనే క్రేజ్ తెచ్సుకుంది.

ఈ చిన్నది విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అఆ సినిమాలో నటించింది.

ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది అనుపమ. ఆతర్వాత ఈ బ్యూటీ క్రేజ్ పెరిగిపోయింది.

సోలో హీరోయిన్ గా నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. యంగ్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సొంతం చేసుకుంది.

అనుపమ పరమేశ్వరన్ మొన్నటి వరకు రొమాంటిక్ సీస్స్ లో నటించలేదు. అలాగే బోల్డ్ గానూ కనిపించలేదు.

ఆతర్వాత రౌడీ బాయ్స్ సినిమాలో లిప్ లాక్ తో షాక్ ఇచ్చింది. దాంతో అభిమానులంతా అవాక్ అయ్యారు. అలాగే టిల్లు స్క్వేర్ సినిమాలో అందాలతో రెచ్చిపోయింది.

ప్రస్తుతం ఈ అమ్మడు కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటడ్ సినిమాలు చేస్తుంది. త్వరలో పరదా సినిమాతో రానుంది అను.