29 October 2025

ఫస్ట్ సినిమాకే దారుణంగా ట్రోలింగ్స్.. ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం దక్షిణాది కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్. టీనేజ్ లోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

అయితే మొదటి సినిమా తర్వాత ఆమెపై దారుణంగా ట్రోలింగ్స్ వచ్చాయట. తనకు యాక్టింగ్ రాదని.. తొలి చిత్రంలో అంతగా నటించలేదని విమర్శించారట.

కానీ ఇప్పుడు ఆమె సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. తెలుగు, తమిళంతోపాటు మలయాళంలోనూ వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈబ్యూటీ.

ఆమె మరెవరో కాదండి. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ప్రేమమ్ సినిమాతో మలయాళీ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసి ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

అయితే ప్రేమమ్ సినిమా తర్వాత తనపై విపరీతమైన ట్రోలింగ్ వచ్చిందని.. ఆ విమర్శలు చూసి తాను చాలా భయపడినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

తనకు నటన రాదు అంటూ దారుణమైన కామెంట్స్ చేశారని.. సొంత ఇండస్ట్రీ నుంచే ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని.. కానీ వాటిని పట్టించుకోలేదని తెలిపింది. 

తెలుగులో వరుస అవకాశాలను అందుకుంటూ తన నటనతో మెప్పించినట్లు తెలిపింది. ఇప్పుడు తనను తాను చూసుకొని గర్వపడుతున్నట్లు చెప్పుకొచ్చింది అనుపమ.

ఈ ఏడాది వరుస సినిమాలతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఇటీవలే బైసన్ సినిమాతో మరో హిట్టు ఖాతాలో వేసుకుంది. ఇందులో విక్రమ్ తనయుడు నటించాడు.