ముద్దు సీన్స్ చేస్తే తప్పేంటీ ? 18 ఏళ్ల వయసులో ఆ విషయం చెప్పిన అనుపమ
Rajitha Chanti
Pic credit - Instagram
టిల్లు స్క్వేర్ సినిమాతో అనుపమ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇన్నాళ్లు ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు రూటు మార్చింది.
అచ్చ తెలుగమ్మాయిగా అందం, అభినయంతో మెప్పించిన అనుపమ... టిల్లు స్క్వేర్ సినిమాలో మాత్రం లిల్లీ పాత్రలో గ్లామర్ షోతో అల్లాడించేసిన సంగతి తెలిసిందే.
అయితే ఇందులో గ్లామర్ షో మాత్రమే కాకుండా లిప్ లాక్స్, రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించింది. దీంతో అనుపమ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఫ్యాన్స్.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ లిప్ లాక్ సన్నివేశాలపై స్పందించింది. లిప్ లాక్ సీన్స్ చేస్తే ఏదో పెద్ద తప్పు చేసినట్లు విమర్శిస్తున్నారని వాపోయింది.
తాను ముద్దు సన్నివేశాల్లో నటించననీ.. గ్లామరస్ గా నటించనని చెప్పింది 18 ఏళ్ల వయసులో అని అన్నారు. కానీ ఇప్పుడు నటిగా తాను పరిణిది చెందానని అన్నారు
కథకు అవసరం అయితే లిప్ లాక్ వంటి సన్నివేశాల్లో నటించడం తప్పేం కాదని అన్నారు. ఒకేరకమైన మూస పాత్రలలో నటించి బోర్ కొడుతుందని అన్నారు.
ప్రస్తుతం తాను నటించిన టిల్లు స్క్వేర్ సినిమా విడుదలకు ముందు తనను విమర్శించారని.. కానీ రిలీజ్ అయిన తర్వాత ప్రశంసిస్తున్నారని చెప్పుకొచ్చింది కేరళ కుట్టి.
సినిమా చూడకుండానే ముందుగా విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ చూసి విమర్శించడం ఏమాత్రం కరెక్ట్ కాదని అన్నారు. టిల్లు స్క్వేర్ రూ. 96 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.