కళ్లుతిప్పుకోలేని అందంతో కట్టిపడేస్తున్న అనుపమ.. 

February  07, 2024

TV9 Telugu

తెలుగులో 'అఆ' మువీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనుపత పరమేశ్వరన్‌ అనతి కాలంలోనే యూత్ ఫేవరెట్‌ హీరోయిన్‌గా మారిపోయింది

మాస్‌ మహరాజ రవితేజ సరసన ఈగల్‌ మువీలో తొలిసారి అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తోంది. ఈ మువీలో తాను నళిని అనే పాత్రలో కనిపించనుంది

తాజాగా ఈగల్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు వచ్చిన నటి అనుపమ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ ఈవెంట్‌కు వైట్‌ కరల్‌ ఫ్లవర్స్ డిజైన్‌ శారీలో వచ్చిన అనుపమ అందాలతో అదరగొట్టింది

వైట్ ఎంబ్రాయిడింగ్ చీర, మ్యాచింగ్ స్లీవ్ లెస్ బ్లౌజ్, నెక్లెస్, ఇయర్ రింగ్స్ ధరించి.. కళ్లు తిప్పుకోలేని అందంతో ఆడియన్స్‌ను ఫిదా చేసింది

ఈ మలయాళీ భామ చీరకట్టు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. సంక్రాంతి ఫెస్టివల్‌కు విడుదల కావల్సిన ఈగల్‌ మువీ పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే

ఈ మువీ మార్చి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మువీలో రవితేజ.. అనుపమ పరమేశ్వరన్‌తోపాటు కావ్య థాపర్ కూడా కనిపించనుంది

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా సంస్థ నిర్మించింది. ప్రస్తుతం రవితేజ, అనుపమతో పాటు చిత్ర బృందమంతా ప్రమోషన్లతో బిజీగా ఉంది

గతేడాది పాన్‌ ఇండియా మువీ కార్తికేయ 2తో ఘన విజయం అందుకున్న అనుపమ పరమేశ్వరన్‌ డీజే టిల్లు 2లో కూడా నటిస్తోంది. త్వరలో ఈ మువీ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది