03 November 2025

ఆ సినిమా వల్ల ఆరు నెలల వరకు అవకాశాలు రాలేదు.. అనుపమ పరమేశ్వరన్..

Rajitha Chanti

Pic credit - Instagram

తెలుగులో వరుస అవకాశాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఈ ఏడాది పరదా, కిష్కింధపురి, జానికి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ చిత్రాలతో అడియన్స్ ముందుకు వచ్చింది. అయితే గతంలో ఓ ఆరునెలలు అవకాశాలు రాలేదట.

టిల్లు స్క్వేర్ సినిమాతో గ్లామర్ హద్దులు చెరిపేసిన అనుపమ.. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ సినిమా చేయకుండా ఉండాల్సిందని చెప్పుకొచ్చింది.

రంగస్థలం సినిమాలో హీరోయిన్ గా సమంత కంటే ముందు తననే అనుకున్నారని.. అందుకు సుకుమార్ టీం తనను సంప్రదించారని. తాను ఓకే చేశానని తెలిపింది.

అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని.. తనను తప్పించి సమంతను తీసుకున్నారని.. కానీ సోషల్ మీడియాలో తానే కావాలని రిజెక్ట్ చేసినట్లు వార్తలు రాశారట.

ఆ వార్తలతో తనకు ఆరు నెలల వరకు అవకాశాలు రాలేదని తెలిపింది. తెలిసీ తెలియకుండా రాసే ఇలాంటి వార్తల వల్ల కెరీర్ పరంగా చాలా ఇబ్బంది పడ్డానని తెలిపింది.

ఇటీవలే కిష్కింధపురి సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది అనుపమ. హారర్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది.

ప్రస్తుతం అనుపమ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది అనుపమ. మరోవైపు సోషల్ మీడియాలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది అనుపమ పరమేశ్వరన్.