అవి తెచ్చిస్తే అనుపమ మీ సొంతం అవుతుందట.. అవెంటంటే..
TV9 Telugu
Pic credit - Instagram
అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు రూటు మొత్తం మార్చేసింది. ఇన్నాళ్లు ట్రెడిషనల్‌గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ సిద్ధు జొన్నలగడ్డ సరసన టిల్లు స్వ్కేర్ చిత్రంలో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్‌కు ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో చెప్పక్కర్లేదు.
ఈమూవీలో హద్దులు దాటేసి మరీ గ్లామర్ షో.. లిప్ లాక్ సీన్స్‌లో నటిస్తుంది. ఇక అటు నెట్టింట సైతం గ్లామర్ రచ్చ చేస్తుండడంతో ఈ బ్యూటీ ఫ్యాన్స్ మాత్రం తెగ హర్ట్ అవుతున్నారు.
ఇక ఇప్పుడు నెట్టింట యాక్టివ్‌గా ఉంటున్న అనుపమ.. తాజాగా తన అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తను అడిగినవి తెచ్చిస్తే మీ సొంతం అవుతానంటూ రాసుకోచ్చింది.
తన ఇన్ స్టా స్టోరీలో ఓ వీడియోను షేర్ చేసింది అనుపమ. అందులో బేబీ హిప్పోస్ కనిపిస్తున్నాయి. వాటిని తీసుకొచ్చి గిఫ్ట్ గా ఇస్తే నేను మీకు సొంతం అంటూ ఆఫర్ ఇచ్చింది.
అంటే వాటిని బహుమతిగా ఇస్తే నేను పెళ్లి చేసుకుంటాను అంటూ హింట్ ఇచ్చేసింది ఈ కేరళ బ్యూటీ. గతంలో ఇష్క్ సినిమాలో గాజులు కొనిస్తే పెళ్లి చేసుకుంటాను అన్నట్లుగా పోస్ట్ చేసింది.
అనుపమ షేర్ చేసిన వీడియోను స్క్రీన్ షాట్స్ తీసి మరీ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. అనుపమ ఇన్ స్టా స్టోరీ స్క్రీన్ షాట్స్ మీమ్స్ చేసి మరీ సోషల్ మీడియాలో క్రేజీగా షేర్ చేస్తున్నారు.
పదండి ఆ హిప్పోని గిఫ్ట్ గా ఇచ్చి అనుపమను పెళ్లి చేసుకుందాం అంటూ బ్రహ్మీ ఫోటోలతో ఫన్నీగా మీమ్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనుపమ చేతిలో టిల్లు స్క్వేర్ మాత్రమే ఉంది.