లిల్లీ సైలెంట్ అందుకేనా.. అనుపమ కొత్త సినిమాకు వెయిటింగ్..
Rajitha Chanti
Pic credit - Instagram
టిల్లు స్క్వేర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది అనుపమ పరమేశ్వరన్. ఇందులో గ్లామర్ హీరోయిన్గా కనిపించి సోషల్ మీడియాలో మరింత ఫాలోయింగ్ సంపాదించింది.
ప్రేమమ్ సినిమా నుంచి మొదలైన ఈ బ్యూటీ ప్రయాణం ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమా భారీ విజయాన్ని అందుకునే వరకు చేరింది. కానీ కొత్త సినిమాకు ఇప్పుడు ఆలోచనలో పడింది.
టిల్లు స్క్వేర్ విడుదలైన వెంటనే ఈ బ్యూటీకి ఆఫర్స్ వచ్చాయని టాక్. కానీ వాటన్నింటిని సున్నితంగా తిరస్కరించిందట అనుపమ. అందుకు పెద్ద కారణమే ఉందని టాక్.
ఆఫర్స్ అన్నింటిని రిజెక్ట్ చేయడానికి పెద్ద కారణమే ఉందంటు ఫిల్మ్ వర్గాల్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. టిల్లు స్క్వేర్ తర్వాత పారితోషికం పెంచే ఆలోచనలో పడిందట అనుపమ.
ప్రస్తుతం హీరోయిన్స్ అంతా ఒక్క హిట్టు పడగానే భారీగా పారితోషికం పెంచేస్తున్నారు. కనుకు ఇప్పుడు ఈ కేరళ కుట్టి కూడా రెమ్యునరేషన్ పెంచే ఆలోచనలో ఉందట.
అందుకే పెద్ద ఆఫర్ కోసం అనుపమ వెయిట్ చేస్తుదంటూ టాక్ నడుస్తుంది. అలాగే ఇప్పటివరకు ఒక రకమైన రోల్స్ చేసిన అనుపమ.. ఇప్పుడు కొత్త పాత్రలు చేయాలనుకుంటుందట.
వైవిధ్యమైన పాత్రలు.. కంటెంట్ బలంగా ఉన్న సినిమాలు చేసేందుకు అనుపమ వెయిట్ చేస్తోందని సమాచారం. అంటే అనుపమ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించాలంటే ఇంకా టైమ్ పడుతుంది.
తెలుగులోనే కాకుండా తమిళంలోనూ వరుస సినిమాలతో బీజీగా ఉంటుంది. ఇటీవలే జయం రవి సరసన సైరన్ సినిమాతో హిట్ అందుకుంది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.