31 October 2025
యంగ్ హీరోతో ప్రేమలో అనుపమ.. చక్కర్లు కొడుతున్న పెళ్లి వార్తలు..
Rajitha Chanti
Pic credit - Instagram
దక్షిణాది సినీప్రియులకు ఇష్టమైన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా తెలుగులోనే నటించి మెప్పించింది.
ఈ ఏడాది వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా అనుపమ ఓ హీరోతో ప్రేమలో ఉందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
గతంలో ఓ ఇంటర్వ్యూలో తాను లవ్ మ్యారేజ్ చేసుకుంటానని.. తన తల్లిదండ్రుల అంగీకారంతోనే పెళ్లి చేసుకుంటానని అనుపమ చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే ఈ బ్యూటీ ఇప్పుడు సీక్రెట్ డేటింగ్ లో ఉందని టాక్ నడుస్తుంది. విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ తో అనుపమ ప్రేమలో ఉందని టాక్ నడుస్తుంది.
వీరిద్దరు చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని ఫిల్మ్ వర్గాల్లో సమాచారం. అలాగే ఇటీవలే వీరిద్దరికి సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది.
దీంతో వీరి ప్రేమ వార్తలకు మరింత బలం చేకూరింది. త్వరలోనే ఇరు కుటుంబాల అనుమతితో వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కనున్నారని టాక్ నడుస్తుంది.
అయితే తన ప్రేమ, పెళ్లి గురించి వస్తున్న వార్తలపై ఇంతవరకు అనుపమ స్పందించలేదు. కానీ ఫిల్మ్ వర్గాల్లో మాత్రం ఈ న్యూస్ తెగ వైరలవుతుంది.
ఇటీవలే అనుపమ, ధృవ్ విక్రమ్ జంటగా బైసన్ చిత్రంలో నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారిందని టాక్.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్