పాలలో అమృతాన్ని కలిపి ఈమెకు ప్రాణం పోశాడేమో ఆ బ్రహ్మ..
23 October 2023
18 ఫిబ్రవరి 1996న కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఇరింజలకుడలో జన్మించింది 27 ఏళ్ళ అందాల తార అనుపమ పరమేశ్వరన్.
ఆమె తండ్రి పేరు పరమేశ్వరన్ ఎరెక్కత్, తల్లి పేరు సునీత పరమేశ్వరన్. ఆమెకు అక్షయ్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు.
కేరళలోని కొట్టాయంలోని CMS కాలేజీలో కమ్యూనికేటివ్ ఇంగ్లీషు డిగ్రీ చేస్తూ నటనను కొనసాగించడానికి విద్యను మధ్యలో వదిలేసింది.
2015లో మలయాళంలో వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ ప్రేమమ్ చిత్రంతో చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ వయ్యారి భామ.
2016లో పృథ్వీరాజ్ సుకుమారన్, వేదిక జంటగా తెరకెక్కిన మలయాళీ చిత్రం జేమ్స్ & ఆలిస్ లో అతిధి పాత్రలో నటించింది.
నితిన్, సమంత జోడిగా నటించిన అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. నాగవల్లి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఆకట్టుకుంది.
మలయాళం ప్రేమమ్ కి రీమేక్ గా వచ్చిన తెలుగు ప్రేమమ్ సినిమాలో కూడా ఓ కథానాయకిగా నటించింది ఈ ముద్దుగుమ్మ.
2017లో శతమానం భవతి సినిమాలో ఫుల్ లెన్త్ కథానాయకిగా ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగులో టిల్లు స్క్వేర్, ఈగల్ చిత్రాల్లో నటిస్తుంది ఈ భామ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి